Tuesday, March 24, 2020

శ్రీ సూర్య సామాన్యనామములు మరియు విశేష నామములు

శ్రీ సూర్య సామాన్యనామములు మరియు విశేష నామములు




అథాదిత్యస్య నామాని సామాన్యాని ద్విజోత్తమాః|| 14
ద్వాదశైవ పృథక్త్వేన తాని వక్ష్యామ్యశేషతః| ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః|| 15
మార్తండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః| రవి ర్ద్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్యనామభిః|| 16
విష్ణు ర్ధాతా భగః పూషా మిత్రేంద్రౌ వరుణోర్యమా|వివస్వా సంశుమాంస్త్వాష్టా పర్జన్యో ద్వాదశఃస్మృతః|| 17
ఇత్యేతే ద్వాదశాదిత్యాః పృథక్త్వేన వ్యవస్థితాః| ఉత్తిష్ఠంతి సదాహ్యేతే మాసైర్ధ్వా దశభిః క్రమాత్‌|| 18
విష్ణు స్తపతి చైత్రే తు వైశాఖే చార్యమా తథా| వివస్వాన్‌ జ్యేష్ఠమాసే తు ఆషాఢే చాంశుమాన్‌ స్మృతః|| 19
పర్జన్యః శ్రావణ మాసి వరుణః ప్రౌష్ఠసంజ్ఞకే| ఇంద్ర ఆశ్వయుజే మాసి ధాతా తపతి కార్తికే|| 20
మార్గశీర్షే తథా మిత్రః పౌషే పూషా దివాకరః| మాఘే భగస్తు విజ్ఞేయ స్త్వష్టా తపతి ఫాల్గునే|| 21
శతై ర్ద్వాదశభి ర్విష్ణూ రశ్మిభి ర్దీప్యతే సదా| దీప్యతే గోసహస్రేణ శతైశ్చ త్రిభి రర్యమా 22
ద్వి స్సప్తకై ర్వివస్వాంస్తు అంశుమాన్‌పంచభిస్త్రిభిః|వివస్వానిన పర్జ్యన్యో వరుణ శ్చార్యమా తథా|| 23
మిత్రవ ద్భగవాం స్త్వష్టా సహస్రేణ శతేన చ| ఇంద్రస్తు ద్విగుణౖః షడ్భి ర్ధాతైకాదశభిః శతైః|| 24
సహస్రేణ తు మిత్రో వై పూషా తు నవభిః శతైః ఉత్తరోపక్రమేర్కస్య వర్ధంతే రశ్మయప్తథా|| 25
దక్షిణోపక్రమే భూయో హ్రసంతే సూర్యరశ్మయః| ఏవం రశ్మిసహస్రంతు సూర్యలోకా దనుగ్రహమ్‌|| 26
ఏవం నామ్నాం చతుర్వింశ దేక ఏషాం ప్రకీర్తితః| విస్తరేణ సహస్రంతు పునరన్యత్‌ ప్రకీర్తితమ్‌|| 27
సూర్యునకు అదిత్య- సవితృ- సూర్య - మిహిర-అర్క - ప్రభాకర-మార్తాండ- భాస్కర-భాను-చిత్రభాను-దివాకర-రవి-ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణు ధాత-భగ-పూష-మిత్ర-ఇంద్ర-వరుణ-అర్యమ-వివస్వత్‌ అంశుమత్‌-త్వష్ట-పర్జన్య-యను నీ పంద్రెండు నామములు విశేషనామములు. విష్ణువు చైత్రమందు పంట్రెండువందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖమందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠమందు పదునాల్గు వందల కరముల తోడను - అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల యంశువులతోను వర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును వరుణుడు భాద్రపదమందు నన్నియే కిరణములచేతను, ఇంద్రుడాశ్వయుజమున పన్నెండవందల కిరణములలోను ధాత కార్తీక మందు వదునొకండువందలకిరణములచేతను మార్గశిరమున మిత్రుడు పైవిధముగాను, పౌషముస పూష తొమ్మిదివందల కిరణములతోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణములతోను వెలుంగుదురు, ఉత్తరాయణమునుండి సూర్యకిరణములు పెంపొందును. దక్షిణాయనమునుండి తగ్గును. ఇట్లు వేలకొలది కిరణములు గ్రహముల ననుసరించి సోర్యునినుండి వెలుపడి వెలుంగును. సూర్య సామాన్యనామములు. వివేష నామము లును గలిసి యిరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేఱుగా నున్నవి.


ఇది బ్రహ్మపురాణమునందు ముప్పది యొకటవ యధ్యాయము.


--------------------
--------------------

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం