సూర్యరథస్థ దేవతాభేద కథనము
సూర్యరథమును ఆయా మాసములందు యథాక్రమమున ఆయా దేవతదలు అధిష్ఠించియుందురు. అందుచేతనే రవి ఆయా మాసములందును ఆయా ఋతువులందును ఆయా ఋషులతో గంధర్వులతో అప్సరసలతో సర్వగ్రామణు (శ్రేష్ఠు)లతో రాక్షసులతో కూడి తన రథమును నడుపుకొనుచుపోవు చుండునని వేదశాస్త్రములందు చెప్పబడుచున్నది.
సూర్యరథమున
1. వసంత ఋతువునందు-మధు-మాధవ-మానములు; ధాత-అర్యమన్-ఆదిత్య దేవతాభేదములు;పులస్త్యవులహులు-ఋషులు-వాసుకి కణాదులు నాగులు-నారద తుంబురులు గంధర్వులు-కృతస్థలాపుంజికస్థలలు అప్సరసలు-రథగృత్స రథౌజసులు గ్రామణులు-హేతిప్రహేతులు రాక్షసులు.
2. గ్రీష్మర్చువునందు-శుచి-శుక్రమానములు; మిత్రుడు-వరుణుడు-ఆదిత్య దేవతాభేదములు-అత్రి వసిష్ఠులు ఋషులు-తక్షకరంభకులు నాగులు-హాహాహూహులు గంధర్వులు-మేనకాసహజన్యలు అప్సరసలు-రథంతర రథకృత్‌లు గ్రామణులు-పౌరుషయోధనులు రాక్షసులు;
3. వర్షర్తువునందు-నభస్-నభస్య-మాసములు-ఇంద్ర-వివాస్వాన్-లు ఆదిత్య దేవతాభేదములు-అంగిరుడు భృగువు ఋషులు-ఏలాపుత్త్ర శంఖపాలులు నాగులు-విశ్వావసూగ్రసేనులు గంధర్వలు-ప్రవ్లూెచానువ్లూెచలు అప్సరసలు-హేతి-వ్యాఘ్రలు రాక్షసులు;
4.శరదృతువునందు ఇషము ఊర్జము మాసములు-పర్జన్యుడు-పూషన్-ఆదిత్య దేవతాభేదములు-భారద్వాజుడు-గౌతముడు ఋషులు-ఐరావతుడు-ధనంజయుడు-నాగులు-చిత్రసేనుడు-సురుచి-గంధర్వులు-విశ్వాచీ-ఘృతాచీ-అప్సరసలు-సేనజిత్-సుషేణుడు-గ్రామణులు-పారుడు-అవారుడు రాక్షసులు;
5. హేమంతమున సహస్-సహస్య-మాసములు-హంసుడు-భగుడు-ఆదిత్యదేవతాభేదములు-కశ్యపుడు-క్రతువు-ఋషులు-మహాపద్ముడు-కర్కటకుడు-నాగులు-చిత్రసేనుడు-ఘూర్ణాయువు-గంధర్వులు-పూర్వచిత్తి-ఊర్వశి-అప్సరసలు-తార్‌క్ష్యుడు-అరిష్టనేమి-గ్రామణులు-విద్యుత్-స్పర్శుడు-రాక్షసులు;
6. శిశిర ఋతువునందు తపన్-తపస్య మాసములు-త్వష్ట-విష్ణువు ఆదిత్య దేవతాభేదములు-జమదగ్ని-కౌశికుడు-ఋషులు-కంబళుడు-అశ్వతరుడు-నాగులు-ధృతరాష్ట్రడు-సూర్యవర్చస్-గంధర్వులు-తిలోత్తమ-రంభ-అప్సరసలు-రుతజిత్-సత్యజిత్-గ్రామణులు-బ్రహ్మోపేతుడు-యక్షోపేతుడు-రాక్షసులు.
శ్రీ మత్స్యమహాపురాణమున ఖగోళ వ్యవస్థయందు సూర్కది గ్రహరథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనను నూట ఇరువదియైదవ అధ్యాయము

No comments:
Post a Comment