Showing posts with label వ్రతము. Show all posts
Showing posts with label వ్రతము. Show all posts

Saturday, March 28, 2020

శుభ సప్తమీ వ్రతము

శుభ సప్తమీ వ్రతము



ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఉపవాస పూర్వకముగా ఆచరించినచో దుఃఖ విము క్తిని భోగములను కలిగించు శుభ స ప్తమీ వ్రతమును తెలిపెదను.
ఆశ్వయుజమాసము పుణ్యప్రదము. దాని శుక్ల స ప్తమినాడు స్నానజపములుచేసి శుచియై విప్రులచే పుణ్యాహ వాచనము చేయించవలెను. కపిలగోవును భ క్తి పూర్వకముగా గంధమాల్యాను లేపనముతో అర్చించవలెను. ''సూర్యుని వలన పుట్టినదియు సర్వ భువనములు నివాసస్థానముగా కలదియు శుభకల్యాణ శరీరము కలదియు అగు నీకు నమస్కారము.'' అని ఆ గోవును నమస్కరించవలెను. రాగి పళ్లెరములో కుంచెడు నూవులుపోసి వాని పై శ్వేతవస్త్రము వేసి వస్త్ర-మాల్య-గుడ-నానా విధ ఫల భక్ష్యఘృత పాయసములతో కూడ బంగారు వృషభ ప్రతిమనుంచి 'అర్యమా ప్రీయతామ్‌' 'రవి ప్రీతి నొందుగాక!' అనుచు సంధ్యాకాలమున విప్రునకు దాన మీయవలెను. ఆ పగ లుపవసించి పంచగవ్యమును ఆహారముగా తీసికొని రాత్రిని గడుపవలెను. మరునాటి యుదయము బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి తానును భుజించవలయును. సంవత్సరము కాలము ఇట్లు చేసి వ్రతాంతమున ఈ చెప్పిన సామగ్రితోపాటు మంచమును పడకను (సర్వ పరికములతోను) పాత్రలను ఆసనములను వేదవిదుడగు విప్రునకు 'వివస్వాన్‌ ప్రీయతామ్‌' 'రవి ప్రీతి నందుగాక! అనెడు మంత్రముతో దానము ఈయవలెను.
ఇట్లు చేయువాడు జన్మజన్మమునందును ఇహమున నిర్మలైశ్వర్యకీర్తులను పొంది వరమున స్వర్గమునందు అప్సరోగణ గంధర్వ గణములచే పూజలందుకొనుదు సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతమువరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతియే జన్మించును. ఈ వ్రతకల్పమును చదివినందున కలిగిన పుణ్యము వేయి బ్రహ్మహత్యలను నూను భ్రూణ హత్యలను నశింపజేయును. (భ్రూణుడు-షడంగములతో వేదముల నధ్యయనము చేసిన విప్రుడు) దీనిని చదివినను ఇతరులకు తెలిపినను ముహూర్తకాలము ఈ వ్రతాచరణము చూచినను అట్టివాడు సర్వ పాప విముక్తుడై విద్యాధరనాయకుడగును.
దీనిని ఏడేండ్లు ఏడు వేరు వేరు విధానములతో ఆచరించిన వాడు క్రమముగా సప్తలోకములకుఅధిపతియై తుదకు ముక్తినందును.
ఇది శ్రీమత్స్యమహాపురాణము శుభ సప్తమీ వ్రత కథనమను ఎనుబదవ అధ్యాయము

మందార సప్తమీ వ్రతము

మందార సప్తమీ వ్రతము


ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదము నగు మందార స ప్తమీ వ్రతమును తెలిపెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్ఠినాడు స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. స ప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను-పద్మహస్తుడగు మనోహరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి వానిపై నుంచవలెను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూరన్పునుండి ఈశాన్యము వరకు గల ప్రతియొక దళమును ఈ ఎనిమిది బంగారు మందారు కుసుమములతో వరుసగా- 1. భాస్కారయ నమః-ప్రాగ్దళం పూజయామి; 2. సూర్యాయ నమః-ఆగ్నేయ దళం పూజయామి; 3. అర్కాయ నమః-దక్షిణ దళం పూజయామి; 4. అర్యవ్ణ నమః-నైరృత దళం పూజయామి; 5. వేదధామ్నే నమః పవ్చిమ దళం పూజయామి; 6. చండభానవే నమః వాయవ్య దళం పూజయామి; 7. పూష్ణే నమః ఉత్తర దళం పూజయామి; 8. ఆనందాయ నమః ఈశాన్య దళం పూజయామి; అని పూజించవలెను. స్వర్ణ పురుష ప్రతిమను పద్మకర్ణికయందుంచి 'సర్వాత్మనే నమః' అని పూజించి నూతన శ్వేతవస్త్రము చుట్టి భక్ష్యమాల్య ఫలాదులతో అర్చించి అవి అన్ని యు వేదవే త్తయగు విప్రునకు దాన మీయవలయును. ఆ రాత్రి తైల లవణములు (కారము పులుపు) లేకుండ ప్రాఙ్ముఖుడై భుజించి మౌనము పాటించవలెను.
ధనమునకై లోభించక యథాశ క్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సరకాలము చేయవలెను. వ్రతాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. ''మందారనాధుడు మందార కుసుమము భవనముగా కలవాడు నగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింపజేయుము'' అని ప్రార్థించుచు ఇట్లు మందార స ప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు. పాపము లనెడు చీకటితో నిండిన సంసార మనెడు రాత్రియందు దీపము వంటి ఈ వ్రతమును ఆధారముగా తీసికొనినచో జారి పడదు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తుడగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మందార స ప్తమీ వ్రతమును డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

కమల సప్తమీ వ్రతమ్‌

కమల సప్తమీ వ్రతమ్‌


ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇపు డిక ఇట్టిదే యగు కమల స ప్తమీ వ్రతమును తెలిపెదను. దానిని కీ ర్తించినంతనే ఆదిత్యుడు సంతసించును. వసంత (చైత్ర వైశాఖములలో నేదైన) శుక్ల స ప్తమినాడు తెల్లని ఆవల (పిండితో-నూనె)తో స్నానము చేసి నూవుల పళ్లెరమునందు నూతన వస్త్రయుగ్మమునుంచి దానిపై బంగారు కమలముంచి గంధపుష్పాదికముతో సమర్చించవలెను. కమలహస్తుడు-విశ్వధారి-దివాకరుడు-ప్రభాకరుడు (పగటిని-ప్రకాశమును కలిగించువాడు) అగు రవీ! నీకు వందనము. అని నమస్కరించవలెను. పిమ్మట వికాల(సంధ్యా)సమయమున విప్రుని వస్త్రమాల్య విబూషణములతో సంపూజించి ఈ సామగ్రితో సువర్ణ కమలమును ఉదకుంభమును శ క్తి యున్నచో సాలంకారముగ కపిలగోవును విధానానుసారము దాన మీయవలెను. స ప్తమినా డుపవసించి అష్టమినాడు యథాశ క్తిగ భుజింపజేసి తానును భుజింపవలెను. సప్తమినాడు మాత్రము తైలములేని ఉపాహారము తినవలెను.
ఇట్లు ప్రతిమాసమున ధనముండియు లోభి చక శుక్ల స ప్తమినాడు సంవత్సరము పొడవున చేయుచు పోవలయును. వ్రతాంతమున (ఉద్యాపనముగా) బంగారు కమలముతోపాటు సర్వోపస్కరములతో శయనము (మంచము పడకలు)బంగారు కొమ్ములు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపములు మొదలగు ఇష్టసామగ్రిని కూడ ఈయవలెను.
ఇట్లు కమల స ప్తమీ వ్రత మాచరించినవాడు అనంతమగు లక్ష్మిని పొందుటయే కాక సూర్యలోకమున సుఖించును. కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్ధ్వలోకములకు క్రమశః పోయి అచ్చట నెల్ల అప్సరసలతో పూజలందుకొని సుఖించి తుదకు ము క్తి నందును.
దీనిని సమగ్రముగా భక్తితో వినినను తెలిపినను ఇహమున స్థిరమగు ఐశ్వర్యము ననుభవించి పరమున విద్యాధర లోకమున సుఖించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున కమల స ప్తమీ వ్రతమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

శర్కరాఫలస ప్తమీవ్రతమ్‌

శర్కరాఫలస ప్తమీవ్రతమ్‌


ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్టిదే యగు శర్కరా స ప్తమీ వ్రతమును తెలిపెదను. అది కల్మషనాశకమును-అనంతాయురారోగ్యైశ్వర్యప్రదమును.
మాఘ శుక్ల స ప్తమినాడుదయమున తెల్లని నూవుల(పొడితో-నూనె)తో స్నానము చేసి తెల్లని వస్త్రమాల్యముల ధరించవలెను. ఆరుగు అలికి దానిపై కుంకుమతో పద్మమును దాని నడుమ కర్ణికను వేయవలెను. 'నమః సవిత్రే' అను మంత్రముతో దానిపై గంధపుష్పము లుంచవలెను. దాని నడుమ నీటి కలశముంచి దానిపై శర్కరాపాత్ర నుంచవలెను. బంగారు గుర్రపు ప్రతిమను దానియందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ నలంకరించవలయును. రవి నీ మంత్రముతో పూజించవలెను. (అర్థము): ''దేవేశా! సర్వదేవమయుడవుగా నీవు వేదములందు పఠింపబడుచున్నావు. కనుక ఈ చరాచర జగ త్తంతయు నీవే.'' తరువాత పంచగవ్యము త్రావి (ఉపవాసముతో) ఆ అరుగునకు దగ్గరగా నేలపయి వయనించవలెను. సౌరసూ క్తములనో పురాణములనో పురాణములనో చదువుచు కాని వినుచు కాని ఆ పగలును రాత్రియు గడుపవలెను. అష్టమినాడు నిత్యానుష్ఠానము నెరవేర్చికొని అదియంతయు బ్రాహ్మణునకు దానము ఈయవలయును. తన శ క్తికొలదిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయసముతో భోజనము పెట్టవలెను. తానును మౌనముతో నుండి తై ల లవణరహితముగా భుజించవలెను.
ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరకాలము చేసి పిమ్మట శర్కరా పూర్ణకలశముతో సర్వోపస్కర (సర్వసామగ్రీ) సహితమగు మంచమును పడకను పాడియావును శక్తి యున్నచో గృహమును కూడ సర్వోపకరణములతో ఈయవలయును. వేయి-లేదా నూరు-లేదా ఒక నిష్కము (పూర్వపు ఒక బంగారు నాణము) తూకముతో బంగారు గుర్రములను (యథాశ క్తి) చేయించి విప్రులచే సౌరసూక్తపాఠము పురాణ పఠనము చేయించి వారి కిది దానమీయవలయును. ధనమునకు లోభించి లోపము చేయుట దోషకరము.
సూర్యు డమృతము త్రావునపుడు అతని నోటినుండి పడిన అమృతపు బొట్టులే వడ్లు పెసలు చెరకు ఐనవి. ఇక్షుసారము శర్కర; అది అందేచే ఈ మూటిలో గొప్పది. అమృత స్వరూపము అయినది. హవ్యకవ్యములందు అందుచే శర్కర రవికి ప్రీతికరము.
ఈ శర్కరా సప్తమీ వ్రతానుష్ఠానము అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. సర్వదుఃఖశాంతిని పుత్త్రసౌత్త్ర వృద్ధిని పరబ్రహ్మత్వమును కూడ కలిగించును. అట్టివా డొక కల్పము కాలము స్వర్గమందుండి పిదప ముక్తి నందును.
దీనిని చదివినను వినినను తలచినను ఉ త్తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సరః సమూహముచే పూజింపబడును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున శర్కరా స ప్తమీ వ్రత కథనమను డెబ్బది యేడవ అధ్యాయము.

ఫల స ప్తమీ వ్రతము

ఫల స ప్తమీ వ్రతము


ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల స ప్తమియను స ప్తమి విషయము తెలిపెదను. ఈ నాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.
మార్గశిర శుక్ల పంచమినాడు వ్రత నియమములు పాటించి గడపి షష్ఠినాడు ఉపవసించవలెను. (విశోక స ప్తమివలెనే) స ప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మత త్త్వము నెరిగి 'భానుర్మే ప్రీయతాం' 'భానుడు నాయందు ప్రీతుడగుగాక!' అనుచు దానమీయవలెను. యథాశ క్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయవలెను. ఇట్లు కృష్ణపక్ష స ప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ (మార్గశిర) స ప్తమినాడును ఉపవసించి హేమఫలమును సువర్ణపద్మమును శర్కరా పాత్రమున వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల స ప్తమితో ఆరంభించి కృష్ణ స ప్తమివరకు) ఉపవాన పూర్వకముగా (రెండు స ప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రముల పఠించుచు చేయుచుండవలెను. ఫలత్యాగము చేయునపుడు మార్గశిరము మొదలు కా ర్తికమువరకు ప్రతి మాసముంనందును వరునగా-భానుఃప్రీయతాం-ఇట్లే-అర్కః-రవిః-బ్రహ్మా-సూర్యః-శక్రః-హరిః-శివః-శ్రీమాన్‌-విభావసుఃత్వష్టా-అరుణః-అను నామములను 'ప్రీయతాం' అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను-స ప్తమినాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయవలయును.
వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. ''రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీ దయచేత నాకును జన్మజన్మమునందును అనంతఫలములు లభించుగాక!'' అని ప్రార్థించుచు దాన మీయవలయును.
అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రతనొంది సూర్యలోకమున పూజితు డగును. వానికి సురాపానాది పాపము లేవైన ఎప్పటివైన ఉన్నను అవియు నశించును. అతని వెనుకముందు ఇరువదియొక తరముల వారును తరింతురు. దీనిని చదివిన-వినిన-వారికి కూడ ఈ ఫలము లభించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలసప్తమీ వ్రత కథనమను డెబ్బదియారవ అధ్యాయము

విశోక సప్తమీ వ్రతము

విశోక సప్తమీ వ్రతము


ఈశ్వరుడిట్లనెను: మునిపుంగవా! ఇట్టిదేయగు విశోక సప్తమి విషయము చెప్పెదను: ఈ సప్తమినాడుపవాసమున ఎప్పుడును శోకమునందడు. మాఘశుక్ల పంచమినాడు దంతధావన పూర్వకముగా తిల (బూర్ణము-తైలము)లతో స్నానముచేసి పులగము మాత్రము తిని ఉపవసించి రాత్రియందు బ్రహ్మచర్యము పాటించవలయును. తెల్లవారి లేచి స్నాన జపములు చేసి శుచియై 'అర్కాయ నమః' అను మంత్రముతో ఎర్రని కరవీర పుష్పములతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్ర ద్వయమునర్పించవలెను. ''మూడు లోకములకు విశోకత్వము (శోకము లేకపోవుట) కలిగించు ఆదిత్యా! నాకును విశోకత్వమును జన్మజన్మములందును నీయందు భక్తిని ప్రసాదింపుము.'' 
యథా విశోకం భువనం త్వయి చాదిత్య సర్వదా | తథా విశోకతా మే స్యాత్త్వద్భక్తిః ప్రతిజన్మని. 
 అను మంత్రముతో ప్రార్థించుచు షష్ఠినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడ పూజించవలెను. ఆనాడు గోమూత్రము మాత్రము ఆహారముగా గడపి రాత్రి నిద్రించిలేచి సప్తమినాడుదయము నిత్యానుష్ఠానము ముగించుకొని విప్రుల నన్నదానపూర్వముగా ఆరాధించి ఆ వస్త్రద్వయమును బంగారు పద్మమును బ్రాహ్మణున కీయవలయును. మౌనవ్రతముతో తైలలవణ రహితముగా భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలయును. ఇట్లు చేయుటచే సుఖమును ఐశ్వర్యమును కలుగును.
ఈ విధానమున అది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునను మరల మాఖశుక్ల సప్తమి వచ్చువరకు చేయవలయును. వ్రతాంతమున సువర్ణకమలముంచిన కలశమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిల గోవును దానము చేయవలెను.
ఈ విధమున విత్త శాఠ్యము (ధనలోభముతో కొంటెతనము) చేయక ఈ విశోక సప్తమీ వ్రతమును చేయు వాడు ఉత్తమ గతి చెందును. వేయినూరుకోట్ల జన్ముల కాలము శోకరహితుడై అమృతత్వానందమును పొందును. కోరికతో చేసినవానికి కోరినదెల్ల సిద్ధించును. నిష్కాముడై చేసినవానికి పరబ్రహ్మ పదములభించును. దీనిని చదివినను వినినను ఇంద్రలోకమునందును. విశోకుడగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక సప్తమీ వ్రతకథనమను
డెబ్బదియైదవ యధ్యాయము.

Friday, March 27, 2020

కల్యాణ సప్తమీ వ్రతమ్‌

కల్యాణ సప్తమీ వ్రతమ్‌


 ఈశ్వరు డిట్లు చెప్పెను: సౌర(సూర్యోపాసం ప్రధానములగు) ధర్మములను చెప్పెదను. వాటి పేరులు-కల్యాణ సప్తమి-విశోక సప్తమి-ఫల సప్తమి-శర్కరా సప్తమి-కమల సప్తమి-మందార సప్తమి-శుభ సప్తమి. ఇవియన్నియు అనంతఫలదములును దేవర్షులచే కూడ పూజితములును. వీటి విధానమును కల్పోక్త ప్రకారమున నామక్రమమున చెప్పెదను.
ఆదిత్య వారముతో కూడిన శుక్ల సప్తమికి కల్యాణ సప్తమియని లోకప్రసిద్ధి. ఈనాటి ఉదయమున గోక్షీర స్నానము చేయవలెను. పిమ్మట తెల్లని స్వచ్ఛ వస్త్రములు ధరించి అక్షతలతో అష్టదళ పద్మము వేయవలెను. దాని నడుమ గుండ్రని కర్ణికను వేయవలెను. ఈ పద్మమునందంతట నిండునట్లు పుష్పములతో అక్షతలతో నారాయణుని ఆకృతి వేయవలెను.

పూర్వస్యాం దిశి తపనాయనమః-ఆగ్నే యతః మార్తాండాయనమః-దక్షిణస్యాం దిశి దివాకరాయనమః-నైరృత్యాం విధాత్రేనమః-పశ్చిమాయాం వరుణాయనమః-వాయవ్యాం భాస్కరాయనమః-ఉత్తరస్యాం వికర్తనాయనమః-ఐశాన్యాం రవయేనమః-ఆదౌ పరమాత్మనేనమః-మధ్యే పరమాత్మనేనమః-అంతే పరమాత్మనేమః-
ఈ మంత్రములతోను శుక్లవస్త్రఫల భక్ష్య ధూపమాల్యానులేపనములతో గుడ లవణములతో పరమాత్ముని పూజించవలెను.
పిమ్మట భూః-భువః-సువః-అను వ్యాహృతి మంత్రములతో బ్రాహ్మణులను యథాశక్తిగా భక్తి పూర్వకముగా గుడక్షీర ఘృతాదికముతో పూజించవలెను. తిలపాత్రమును హిరణ్యమును బ్రాహ్మణునకర్పించవలెను. ఈ నియమముల పాటించి వ్రతము జరిపి నిద్రించి ఉదయమున మేలుకని స్నాన జపములాచరించి బ్రాహ్మణులతో కూడ ఘృతపాయసము భుజించవలయును. దంభమునకు కాక నిష్కపట భావముతో వేదవేత్తయగు విప్రునకు ఘృతపాత్రమును ఉదకుంభమును బంగారమును 'దీనిచే పరమాత్ముడగు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక!' అను మంత్రముతో సమర్పించవలయును. ఈ విధముగా ప్రతి మాసమునందును చేయవలయును. పదుమూడవ మాసమున మొగమునందు బంగారు పట్టె వస్త్రాలంకారములు కలిగిన పాడియావులను పదుమూడింటిని దానమీయవలయును. ధనము లేనివాడు ఇతరులతో పోటీపడక ఒక పాడి ఆవునైన ఈయవలయును. ధనము కలవాడు మాత్రము తనకు శ క్తియుండియు ధనలోభముచే తక్కువ ఈయరాదు. విత్త మోహము చూపుటచే అధఃపతితుడగును. ఈ విధానమున కల్యాణ సప్తమీ వ్రతము చేయువాడు సర్వపాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములగు ఆయురారోగ్యైశ్వర్యములను పొంది పరమున సూర్యలోకమున పూజితుడగును. ఈ కల్యాణ సప్తమి సదా సర్వపాప హరయును సర్వదేవతా పూజితయును సర్వ దోషోపశమని యునునైనది.
అనంత ఫలప్రదయగు ఈ కల్యాణ సప్తమీ విషయమును వినినను చదివినను పాపముక్తుడగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున కల్యాణ సప్తమీ వ్రతకథనమను డెబ్బది నాలుగవ అధ్యాయము.

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌


మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మకమును సనాతనమునునగు పరబ్రహ్మ తత్త్వపు తేజము జగమున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నారాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య వారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాత్రియందు) భుజించవలెను. ఎట్లన- ఆదిత్య వారముతో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు-శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తముచే విమత్సరుడై యుండి ఆదిత్యవారమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.
(దానికి ముందు) రక్తచందనముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతేనమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున 'మహేంద్రాయనమః' ఉత్తరమున 'ఆదిత్యాయనమః' ఈశాన్యమన ' శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణికలో తూర్పున 'రవితురగేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున 'మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణకనడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఝ్యమీయవలెను. (మంత్రార్థము): దివాకరానీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు ; అగ్నీంద్రరూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్నిమీళే' ఇత్యాది ఋక్కులతో నీకు నమస్కారము. 'ఇషేత్వోర్జేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మంత్రముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్ఝ్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆరాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక వ్రతములను దానములను ఆచరించినవాడు అంగవైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్రమాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశక్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అపంలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు అగు పాడి యావును దానమీయవలెను. (దానమంత్రము): ''పాపవినాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సాను వేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము.''
ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతల తను సేవింప సూర్యపదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు అమితాయువునై ఊర్ద్వ సప్తలోకములను చేరి సుఖించును.
స్త్రీయైనను భర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతమును ఇట్లాచరించినచో ఆమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును . సందియము లేదు.
ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదిం (ప్రశంసిం)చినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంత్రభవనమున సుఖించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రతమాహాత్య్మ కథనమను తొంబది ఆరవ అధ్యాయము.

Thursday, March 26, 2020

ఆదిత్యశయనవ్రతము

ఆదిత్యశయనవ్రతము


భీష్ముడనియె : ఉపవాస ఫలము కావలెనని కోరును జబ్బు మనిషి. అలాంటి వానికి హితమైన వ్రత మానతిమ్మన పులస్త్యుడనియె. ఉపవాసమునకు శక్తి లేనివానికి నక్త భోజనము (రాత్రి భోజనము) సమ్మతము. ఆదిత్యశయన వ్రత మందది యనుకూలము. ఆ వ్రతమునందు శంకరు నర్చన జరుగును. హస్త నక్షత్రము సప్తమి తిథి భానువారమును కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రాంతి కూడ యైనచో నది సర్వ కామ సమృద్ధి నిచ్చును. 

ఆనాడు చేయవలసినది ఆదిత్య శయన వ్రతము సూర్య నామములు సెప్పి ఉమామహేశ్వర పూజ సేయవలెను. శివలింగమును ఉమామహేశ్వరులనీ యిద్దరిని గలిసి పూజింపవలెను. కారణము యిద్దరికి భేదము లేకపోవుటయే.



హస్తేతు సూర్యాయ నమోస్తు పాదావర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశం |
స్వాతీషు జంఘే పురుషోత్తమాయ ధాత్రే విశాఖాసు చ జానుదేశమ్‌ || 7
తథానురాధాసు నమోభిపూజ్యమూరుద్ద్వయం చైవ సహస్రభానోః |
జ్యేష్టాస్వనంగాయ నమోస్తు గుహ్యమింద్రాయ భీమాయ కటిం చ మూలే || 8
పూర్వోత్తరాషాడయుగే చ నాభిం త్వష్ట్రే నమః సప్తతురంగగమాయ |
తీక్షాంశ##వే శ్రవణ చాథ కుక్షీం పృష్టం ధనిష్టాసు వికీర్తనాయ || 9
వక్షఃస్థలం ధ్వాంతవినాశాయ జలాధిపర్షే ప్రతిపూజనీయం |
పూర్వోత్తరాభాద్రపదద్వయే చ బాహూత్తమశ్చండకరాయ పూజ్యై || 10
సామ్నామధీశాయ కరద్వయం చ సంపూజనీయం నృప రేవతీషు |
నఖాని పూజ్యాని తథాశ్వినీఘ నమోస్తు సప్తాశ్వధురంధరాయ || 11
కఠోరధామ్నే భరణీషు కంఠం దివాకరాయేత్యభిపూజనీయం |
గ్రీవాగ్నిపక్షేధరసంపుటే తు సంపూజయేద్భారత రోహిణీషు || 12

మృగేర్చనీయా రసనా పురారే రౌత్రే తు దంతాహరయే నమస్తే |
నమః సవిత్రే ఇతి శంకరస్య నాసాభిఫూజ్య చ పునర్వసౌ చ || 13
లలాటమంభోరుహవల్లభాయ పుష్యేలకాన్వేదశరీరధారిణ |
సార్పే చ మోలిం విబుధప్రియామ మఘాసు కర్ణావితి పూజనీ || 14
పూర్వాసు గోబ్రాహ్మణనందనాయ నేత్రాణి సంపూజ్యతమాని శంభోః | అథోత్తరాఫాల్గునిభే భ్రువౌ చ విశ్వేశ్వరాయేతి చ పూజనీయే || 15
నమోస్తు పాదాంకుశపద్మశూలకపాలసర్పేందుధనుర్థరాయ |
గయాసురానంగపురాంధకాదివినాశమూలాయ నమః శివాయ || 16

నూనె, మాంసము, కారము లేని యాహారము తినవలెను. భుక్తశేషము తినరాదు. రాజా! ఈలా నక్తములు చేసి పునర్వసు నక్షత్రమందు శాలి బియ్యమొక ప్రస్థము ఉదుంబర పాత్రమునందుంచి ఆవు నెయ్యితో బంగారము విప్రునకీయ వలెను. సప్తను పారణమందు వస్త్రముల చావు అధికముగ నీయవలెన. పదునాల్గవ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలయిన వానితో బ్రాహ్మణునికి భోజనము పెట్టి బంగారు తామర పువ్వు ఎనిమిదంగుళాల విరిచినది పద్మరాగ మణులు దేవతలతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను విరుద్ధగ్రంధి వర్జితాల తలగడతో, వితానముతో, పక్క దుప్పటితో, పాదుకలు, పాదరక్షలు, గొడుగు చామరము (వింజరామర), పీట (ఆసనము), అద్దము అలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందలంకరించి కపిల గోవును వస్త్రము కప్పి, వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ములతో, దూడతో , కంచు పాలచెంబుతో మంత్ర పూర్వకముగా పూర్వాహ్ణము దాటకుండ దానమీయవలెను.

యథైవాదిత్య శయనమశూన్యం తవ సర్వదా | కాంత్యా ధృత్యా శ్రియా పుష్ట్యా తథా మే సంతు వృధ్దయః || 
యథా న దేవాః శ్రేయాంసం త్వదన్యమనఘం విదుః | తథా మాముద్దరా శేషదుఃఖసంసారసాగరాత్‌ || 
తతః ప్రక్షిణకృత్య ప్రణమ్య చ విసర్జయేత్‌ | శయ్యాం గవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్‌ || 
దాన మిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము భావము-
ఆదిత్యమూర్తీ భగవంతుడా ! నీశయనమెప్పుడూ అశూన్యమో (నిండుగానుండునో) కాంతిచే, ధైర్యముచే, సంపదచే పుష్టిచే నేలాంటి లోటు లేనిచో అలా నాకు సర్వ వృద్దులు గలుగు గాక ! అలా నన్ను సర్వ దుఃఖ సాగరము నుండి యుద్దరింపు అని పలికి ప్రదక్షిణము సేసి నమస్కరించి యా విప్రుని సాగనంపవలెను. శయ్య గోవు వంటి సత్కరించిన సామగ్రినంతయు నా ద్విజునింటికి జేర్చవలెను.

ఈ వ్రత మాచరించిన స్త్రీ పురుషుడు బంధుప్రీతి ధనాది సంపదల కెడవడడు. భార్యా పుత్రాదులతో నిరంతరానందభరితులగుదురు. మున్ను వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులీ వ్రత మాచరించిరి. ఈ కథ పఠించినను నీ ఫలము సింద్దించును. విన్నను పాపములన్నియు పోయి ఫలములివి కల్గును. నరకము పాలైన పితరులను గూడ యిది యుద్దరించును.

రావి, మఱ్ఱి, మేడి, నందీశము , నేరేడు, మారేడు నను నీ ఆఱు వృక్షముల పుల్లలతో మార్గశిరము మొదలు రెండేసినెలకొక్క దానిచే దంత ధావనము సేయవలెను. పండ్రెండు మాసాలైనంత దధ్యన్నము, వితానము (చాందిని) జెండా చామరలతోనుదక కుంచములయందు రత్నాలతో దానము సేయవలెను. విత్తలోభము సేయకూడదు. దానిచే సర్వైశ్వర్య సంపన్ను లగుదురు.
ఇది శ్రీ పద్మ మహా పురాణం - ఆదిత్యశయన వ్రతమను యిరువది యైదవ అధ్యాయము.


ఆరోగ్య వ్రతము - శ్రీ సూర్యారాధన

ఆరోగ్య వ్రతము - శ్రీ సూర్యారాధన

అగస్త్యు డిట్లు చెప్పెను: మిక్కిలి పుణ్యమైనది, పాపములన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియజేసెదను. మాఘమాసము శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కరదేవుని పూజింపవలయును.
ఆదిత్య భాస్కర రవే భానో సూర్య దివాకర,
ప్రభాకరేతి సంపూజ్య ఏవం సంపూజ్యతే రవిః. 3

ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింపవలయును. షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమినాడు భానుని పూజింప వలయును. అష్టమినాడు మరల భొజనము చేయవలయును. ఇది యిందలి విధిక్రమము. ఈ విధితో ఒకనిండు సంవత్సరము సూర్యునర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగును.
మునుపు అసరణ్యుడను గొప్పబలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతనియెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమమగు ఆరోగ్యమును ప్రాసాదించెను.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది రెండవ అధ్యాయము.

సప్తమీవ్రతవర్ణన

సప్తమీవ్రతవర్ణన


అగ్ని రువాచ :
సప్తమీ వ్రతకం వక్ష్యే సర్వేషాం భుక్తిముక్తిదమ్‌ | మాఘమాసేబ్జకే శుక్లే సూర్యం ప్రార్చ్య విశోకభాక్‌.
సర్వావాప్తిస్తు సప్తమ్యాం మాసి భాద్రేర్కపూజనాత్‌ |
పౌషే మాసి సితే నశ్నన్ప్రార్చ్యార్కం పాపనాశనమ్‌. 2
కృష్ణపక్షే తు మాఘస్య సర్వావాప్తిస్తు సప్తమీ | ఫాల్గునే తు సితే నన్దాసప్తమీ చార్కపూజనాత్‌. 3
మార్గశీర్షే సితే ప్రార్చ్య సప్తమీ చాపరాజితా | మార్గశీర్షే సితే చాబ్దం పుత్రీయా సప్తమీ స్త్రియాః. 4
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సప్తమీవ్రతాని నామ ద్వ్యశీత్యధిక శతతమో೭ ధ్యాయః.
అగ్నిదేవుడు చెప్పెను : అందరికిని భుక్తిముక్తిప్రద మగు సప్తమీ వ్రతమును చెప్పెదను. 
మాఘశుక్ల సప్తమీతిథియందు కమలమును నిర్మించి దానిపై సూర్యుని పూజించినవాడు శోకరహితు డగును. 
భాద్రపదశుక్ల సప్తమి యందు సూర్యుని పూజించినచో సకలాభీష్టవస్తువులు లభించును. 
పౌషశుక్లసప్తమియందు ఉపవాసము చేసి సూర్యుని ఆరాధించినచో సకలపాపములును నశించును. 
మాఘకృష్ణసప్తమినాడు 'సర్వాప్తిసప్తమీ' వ్రతము చేసినచో అభీష్ట-వస్తువులు లభించును. 
ఫాల్గునకృష్ణపక్షమునందు నందసప్తమీవ్రతమును చేయవలెను. 
మార్గశీర్షశుక్లపక్షమున పుత్రీయసప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు.
అగ్నిమహాపురాణమునందు సప్తమీవ్రతవర్ణన మను నూటఎనుబదిరెండవ అధ్యాయము

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం