శుభ సప్తమీ వ్రతము
ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఉపవాస పూర్వకముగా ఆచరించినచో దుఃఖ విము క్తిని భోగములను కలిగించు శుభ స ప్తమీ వ్రతమును తెలిపెదను.
ఆశ్వయుజమాసము పుణ్యప్రదము. దాని శుక్ల స ప్తమినాడు స్నానజపములుచేసి శుచియై విప్రులచే పుణ్యాహ వాచనము చేయించవలెను. కపిలగోవును భ క్తి పూర్వకముగా గంధమాల్యాను లేపనముతో అర్చించవలెను. ''సూర్యుని వలన పుట్టినదియు సర్వ భువనములు నివాసస్థానముగా కలదియు శుభకల్యాణ శరీరము కలదియు అగు నీకు నమస్కారము.'' అని ఆ గోవును నమస్కరించవలెను. రాగి పళ్లెరములో కుంచెడు నూవులుపోసి వాని పై శ్వేతవస్త్రము వేసి వస్త్ర-మాల్య-గుడ-నానా విధ ఫల భక్ష్యఘృత పాయసములతో కూడ బంగారు వృషభ ప్రతిమనుంచి 'అర్యమా ప్రీయతామ్' 'రవి ప్రీతి నొందుగాక!' అనుచు సంధ్యాకాలమున విప్రునకు దాన మీయవలెను. ఆ పగ లుపవసించి పంచగవ్యమును ఆహారముగా తీసికొని రాత్రిని గడుపవలెను. మరునాటి యుదయము బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి తానును భుజించవలయును. సంవత్సరము కాలము ఇట్లు చేసి వ్రతాంతమున ఈ చెప్పిన సామగ్రితోపాటు మంచమును పడకను (సర్వ పరికములతోను) పాత్రలను ఆసనములను వేదవిదుడగు విప్రునకు 'వివస్వాన్ ప్రీయతామ్' 'రవి ప్రీతి నందుగాక! అనెడు మంత్రముతో దానము ఈయవలెను.
ఇట్లు చేయువాడు జన్మజన్మమునందును ఇహమున నిర్మలైశ్వర్యకీర్తులను పొంది వరమున స్వర్గమునందు అప్సరోగణ గంధర్వ గణములచే పూజలందుకొనుదు సుఖించి చివరకు దేవగణాధిపుడై కల్పాంతమువరకు ఉండి మరల కల్పాదియందు సప్త ద్వీపాధిపతియే జన్మించును. ఈ వ్రతకల్పమును చదివినందున కలిగిన పుణ్యము వేయి బ్రహ్మహత్యలను నూను భ్రూణ హత్యలను నశింపజేయును. (భ్రూణుడు-షడంగములతో వేదముల నధ్యయనము చేసిన విప్రుడు) దీనిని చదివినను ఇతరులకు తెలిపినను ముహూర్తకాలము ఈ వ్రతాచరణము చూచినను అట్టివాడు సర్వ పాప విముక్తుడై విద్యాధరనాయకుడగును.
దీనిని ఏడేండ్లు ఏడు వేరు వేరు విధానములతో ఆచరించిన వాడు క్రమముగా సప్తలోకములకుఅధిపతియై తుదకు ముక్తినందును.
ఇది శ్రీమత్స్యమహాపురాణము శుభ సప్తమీ వ్రత కథనమను ఎనుబదవ అధ్యాయము

No comments:
Post a Comment