శ్రీ సూర్య ఏక వింశతి నామకీర్తనమ్
బ్రహ్మయిట్లనియె. మునులార! సూర్య సహస్రనామ పారాయణమువలన నే ఫలము గల్గునో పవిత్రము శుభావహము-గుహ్యములునైన యా సూర్యనామములను మీకు దెల్పెదను వినుండు.
వికర్తనో వివస్వాంశ్చ మార్తండో భాస్కరో రవిః| లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః
లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా| తపన స్తాపన శ్చైవ శుచిః సప్తాశ్వవాహనః||
గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః| ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టః సదా రవేః ||
సూర్యుని యిరువది యొక్క నామములు మూలమున స్పష్టము. ఈ పవిత్ర నామ స్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును. ఇది శరీరారోగ్యము, ధనవృద్ధి యశస్సును గూర్చును. రెండు సంధ్యలందు నీ స్తుతి పఠించిన పాపములెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణకృతమైన దురితము నశించును. ఒక మారీనామములచే హోమము సంద్యోపాసనము చేసిన ఆర్ఘ్యమందు బలియందు అన్నదానమందు స్నానమున నమస్కారమందు ప్రదక్షిణమందు నీ మహామంత్రము పఠించిన సర్వపాపక్షయమగును. శుభమగును. కావున మీరీమంత్రము పఠించి వరదుడైన సూర్యదేవుని నుతింపుడు.
బ్రహ్మపురాణము -ముప్పది యొకటవ యధ్యాయము నుండి.
----------------------------
----------------------------

No comments:
Post a Comment