ఆది కృత సూర్యస్తుతి
నమస్తుభ్యం పరం సూక్ష్మం సుపుణ్యం బిభ్రతేతులమ్| ధామ ధామవతా మీశం ధామాధారంచ శాశ్వతం|| 12
జగతా ముపకారాయ త్వామహం స్తౌమి గోపతే| ఆదదానస్య యద్రూపం తీవ్రం తసై#్మ నమామ్యహమ్|| 13
గ్రహీతు ముష్టమాసేన కాలేనాంబుమయం రసమ్| బిభ్రతస్తవ యద్రూప మతితీవ్రం నతాస్మితత్|| 14
సమేత మగ్నీ షోమాభ్యాం నమస్తసై#్శగుణాత్మనే| యద్రూప మృగ్యజుః సామ్నా మైక్యేన తపతే తవ|| 15
విశ్వమేతత్త్రయీ సంజ్ఞం నమస్తసై#్మ విఖావసో| యత్తు తస్మాత్పరం రూప మో మిత్యుక్త్వా భి సంహితమ్||
అస్థూలం స్థూల మమలం సమస్తసై#్మ సనాతన|| 16
సూక్ష్మము పుణ్యము స్వచ్ఛమునైన పరమతేజస్సును ధరించు నీకు నమస్కారము. తేజోవంతులకు నీశ్వరుడును దేజస్సులకు నాధారభూతుడు శాశ్వతుడునై జగదుపకారమునకై తీవ్రరూపము దాల్చిన నిన్ను స్తుతించెదను. ఓ గ్రహావతి! ఎనిమిదిమాసములు (ఆదాన మాసములు) జలరూపమయిన రసమును గ్రహించుటకు దీవ్రరూపముం దాల్చు నీకు వినత నయ్యెదను. అగ్నీషోములతో గూడి త్రిగుణాత్మకమై ఋగ్వజుసామ రూపవేదత్రయీ రూపమైన నీ స్వరూప మీ విశ్వమును తపించుచున్నది. అట్టి నీకు నమస్కారములు. ఓ సనాతన మూర్తి! నీ త్రయీరూపము కంటె పరమై ఓం కారము చేత అభినంహితమైన (వర్ణింపబడిన) స్థూలము సూక్ష్మమునైన యా నీ రూపమునకు నమస్కారము.
దేవ ప్రసీద పుత్రాణాం హృతం త్రిభువనం మమ | యజ్ఞభాగా శ్చ దైతేయై ర్దానవైశ్చ బలాధికైః 25
త న్నిమిత్తం ప్రసాదం త్వం కురుష్వ మమ గోపతే| అంశేన తేషాం భ్రాతృత్వం గత్వా తా న్నాశయే రిపూన్ 26
యథామే తనయా భూయో యజ్ఞభాగభుజః ప్రభో | భవేయు రధిపాశ్చైవ త్రైలోక్యస్య దివాకర 27
తథానుకల్పం పుత్రాణాం సుప్రసన్నో రవే మమ | కురు ప్రపన్నార్తిహర కార్యం కర్తాత్వ ముచ్యతే || 28
శ్లో|| తత స్తా మాహ భగవా న్భాస్కరో వారితస్కరః | ప్రణతా మదితిం విప్రాః ప్రసాదసుముఖో విభుః || 29
గ్రహరాజా! నా యెడను నా పుత్రులయెడను ప్రసన్నుడవుగమ్ము. ప్రబలురైన దైత్యదానవులు త్రిభువనములను హరించి యజ్ఞభాగములను తామే యనుభవించుచున్నారు. అందుచే మాయెడల ప్రసన్నుడవై నీ యంశమున వారికి భ్రాతవై జన్మించి యా శత్రువులను నశింపజేయుము. నా కుమారులు మరల యజ్ఞభాగముల ననుభవించి ముల్లోకములకు ప్రభువులగు నట్లనుగ్రహింపుము. శరణన్నవారి దుఃఖమును హరించువాడవు. వారి కార్యము జక్కబెట్టువాడవునని పేరొందితివి.
శ్రీబ్రహ్మపురాణమునందు ''మార్తాండశరీరలిఖనము'' అను ముప్పదిరెండవ యధ్యాయము

No comments:
Post a Comment