Wednesday, March 25, 2020

శ్రీ సూర్యనారాయణ మూర్తి - ద్వాదశ మూర్తి

శ్రీ సూర్యనారాయణ మూర్తి - ద్వాదశ మూర్తి




ఇంద్రుడు. ధాత, పర్లన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, ఆంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. అను నీ పండ్రెండు మూర్తులచే నీ పరమాత్మ సర్వజగమ్ములు వ్యాపించియున్నాడు. 

దేవశత్రునాశిని యైన మూర్తి ఇంద్రరూపమున దేవ రాజ్యనుందున్నది మొదటిది, రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘములందు వర్షించునది. నాల్గవదివనస్పతులందు నోషథులందున్నది. ఐదవమూర్తి పూష అన్నగతమై ప్రజల పోషించును. అఱవమూర్తి ఆర్యమా రూపమై దేవతలందున్నది. సప్తమమూర్తి భగనామమున దేహులదేహములందు, సంపదలందు నున్నది. ఎనిమిదవది వివస్వాన్‌ అగ్నిగా నుండి జీవుల యాహారమున పచనము చేయుచున్నది. తొమ్మిదదది ''విష్ణువు'' అను మూర్తి. దేవశత్రు సంహార మునకు ప్రపర్తించును. పదవమూర్తి వాయువునందుండిజీవులకు సుఖ స్పర్శనొసంగి యానందపెట్టును. పదునొకండవ మూర్తి వరుణనామకము, జలములందుండి ప్రజాపుష్టి కూర్చును. పదిరెండవమూర్తి మిత్ర సంజ్ఞకము. లోకహితమునకై చంద్ర నదీ తీరమందున్నది. ప్రభాకరుడీమూర్తితోవాయుభక్షణ సేయుచుమైత్రీవ్రయుక్తమైనచూపుతోవరములిచ్చిభక్తానుగ్రహముచేయుచుచంద్ర నదీతటమందు తపముచేయుచుండును. కావున నతడు మిత్రుడను బిరుదు నామ మందెనని స్మృతులు తెలపుచున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగుపరమాత్మ స్థావర జంగమములకెల్ల ఆత్మరూపుడైన సూర్యభగవానుడై ధ్యానమునకు లక్ష్యమై నమస్యుడు. ఈ ద్వాదశాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు పఠించుచు వినువారు సూర్యలోకముందు వెలుగొందుదురు.


తస్య యా ప్రథమామూర్తి రాదిత్యస్యేంద్ర సంజ్ఞితా| స్థితా సా దేవరాజత్వే దేవానం రిపునాశినీ|| 28
ధ్వితీయా తస్య యామూర్తి ర్నామ్నా ధాతేతి కీర్తితా| స్థితా ప్రజాపతిత్వేన వివిధాః సృజతే ప్రజాః|| 29
తృతీ యార్కస్య యా మూర్తిః పర్జన్య ఇతి విళ్రుతా| మేఘేష్వేవ స్థితా సాతు వర్షతే చ గభ స్తిభిః|| 30
చతుర్ధీ తస్య యా మూర్తి ర్నామ్నా త్వష్టేతి విశ్రుతా | స్థితా వనస్సతౌ సాతు ఓషధీషు చ సర్వతః|| 31
పంచమీ తస్య యా మూర్తి ర్నామ్నా పూషేతి విశ్రుతా| అన్నే వ్యవస్థితా సాతు ప్రజాః వుష్ణాతి నిత్యశః|| 32
మూర్తి ష్షష్ఠీ రవే ర్యాతు అర్యమా ఇతి విశ్రుతా | వాయో స్పంసరణా సాతు దేవేష్వేవ సమాశ్రితా|| 33
భానోర్యా స ప్తమీ మూర్తి ర్నామ్నా భ##గేతి విశ్రుతా | భూతి ష్వవస్ధితా సాతు శరీరేషు చ దేహినామ్‌ || 34
మూర్తిర్యా త్వష్టమీ తస్య వివస్వానితి విశ్రుతా| ఆగ్నౌ ప్రతిష్టితా సాతు పచత్యన్నం శరీరిణామ్‌|| 35
నవమీ చిత్రభానో ర్యా మూ ర్తి ర్విష్ణుశ్చ నామతః | ప్రాదుర్భవతి సా నిత్యం దేవానా మరిసూదనీ|| 36
దశమీ తస్య యా మూర్తి రంశుమానితి విశ్రుతా| వా¸° ప్రతిష్టితా సాతు ప్రహ్లాదయతి వై ప్రజాః || 37
మూర్తి స్త్వేకాదశీ భానో ర్నామ్నా వరుణ సంజ్ఞితా| జలే ష్వవస్థితా సాతు ప్రజాం పుష్ణాతి నిత్యశః || 38
మూర్తిర్యా ద్వాదశీ భానో ర్నామ్నా మిత్రేతి సంజ్ఞితా | లోకానాం సా హితార్థాయ స్థితా చంద్ర సరిత్తటే|| 39
వాయుభక్ష స్తపస్తేపే స్థిత్వా మైత్రేణ చక్షుషా | అనుగృహ్ణ న్సదా భక్తాన్‌ వరైర్నానావిధై స్తునః|| 40
ఏవం సా జగతాం మూర్తి ర్హితాయ విహితా పురా|తత్ర మిత్రః స్థితో యస్మా త్తస్మా న్మిత్రంపరం స్మృతమ్‌|| 41
ఆభి ర్ద్వాదశభి స్తేన సవిత్రా పరమాత్మనా | కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిశ్చ ద్విజోత్తమా|| 42
తస్మా ద్ధ్యేయో నమస్యశ్చ ద్వాదశస్థాను మూర్తిషు| భుక్తిమద్భి ర్నరైర్నిత్యం తద్గతే నాంతరాత్మనా|| 43
ఇత్యేవం ద్వాదశాదిత్యా స్నమస్కృత్వా తు మానవః | నిత్యం శ్రుత్వా పఠిత్వాచ సూర్యలోకే మహీయతే|| 44

బ్రహ్మపురాణమందు ఆదిత్య మాహాత్మ్యము అను ముప్పదియవ యధ్యాయము.

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం