Monday, March 23, 2020

శ్రీ సూర్యాష్టోత్తరశతనామస్తోత్రము

శ్రీ సూర్యాష్టోత్తరశతనామస్తోత్రము



ఓం సూర్యో ర్యమా భగ స్త్వష్టా పూషా ర్కః సవితా రవిః|గభస్తిమా నజః కాలో మృత్యు ర్ధాతా ప్రభాకరః 34
పృధివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం | సోమో బృహస్పతిః శుక్రో బుధో  గారక ఏవచ || 35
ఇంద్రో వివస్వాన్‌ దీప్తాంశుః శుచిః శౌరిః శ##నైశ్చరః|బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః ||
వైద్యుతో జాఠర శ్చాగ్ని రైంధన స్తేజసాం పతిః | ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః || 37
కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః | కలా కాష్ఠా ముహూర్తాశ్చ క్షపా యామా స్తథా క్షణాః || 38
సంవత్సరకరో శ్వత్థః కాలచక్రో విభావసుః | పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || 39
కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః | వరుణః సాగరో ంశశ్చ జీమూతో జీవనో 7రిహా || 40
భూతాశ్రయో భూతపతిః సర్వలోకనమస్కృతః | స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాది రలోలుపః || 41
అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః | జయో విశాలో వరదః సర్వభూతనిషేవితః || 42
మనః సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారణః | ధన్వంతరి ర్థూమకేతు రాదిదేవో దితేఃసుతః || 43
ద్వాదశాత్మా రవి ర్దక్షః పితా మాతా పితామహః | స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్‌ || 44
దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః | చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః || 45
ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యామితతేజసః|నామ్నా మష్టశతం రమ్యం మయా ప్రోక్తం ద్విజోత్తమాః || 46
సురగణపితృయక్షసేవితః | హ్యసుర నిశాకరసిద్ధవందితం | వరకనకహుతాశనప్రభం ప్రణిపతితోస్మి హితాయ భాస్కరమ్‌ || 47
సూర్యోదయే యః సుసమాహితః పఠేత్‌ స పుత్రదారాన్‌ ధనరత్న సంచయమ్‌
లభేత జాతిస్మరతాం నరః సతు స్శృతించ మేధాంచ స విందతే పరామ్‌ || 48
ఇమం స్తవం దేవవరస్య యో నరః ప్రకీర్తయే చ్ఛుద్ధమనాః సమాహితః
విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్‌ లభేత కామా న్మనసా యథేప్సితాన్‌ || 49
ఇతి శ్రీబ్రహ్మపురాణ బ్రహ్మఋషిసంవాదేసూర్యష్టోత్తరశతంనామత్రయస్త్రింశోధ్యాయః
గొప్ప తేజశ్శాలియగు శ్రీ సూర్యుని అష్టోత్తరశతనామములు చెప్పబడెను. సురాసురసిద్ధపితృ యక్షగణ సేవితుడును, సువర్ణము అగ్నియొక్క కాంతివంటి కాంతిగలవాడును నగు భాస్కరుని నా శ్రేయస్సుకొరకు నమస్కరింతును. సూర్యోదయకాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధాన చిత్తుడై చదివినవాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధనరత్నసముదాయమును, పూర్వజన్మస్మృతిని, జ్ఞాపకశక్తిని, గొప్ప ధారణాశక్తిని పొందగలడు. సంసార దావాగ్ని సాగరమునుండి విముక్తి నందును. మనోరథముల నెల్ల పొందును.
ఇది బ్రహ్మపురాణమునందు సూర్యాష్టోత్తరశతనామస్తోత్రమను ముప్పది మూడవ అధ్యాయము.

----------------------



----------------------

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం