Monday, March 23, 2020

శ్రీ బ్రహ్మ కృత శ్రీ సూర్య స్తోత్రం

శ్రీ బ్రహ్మ కృత శ్రీ సూర్య స్తోత్రం





ఇది బ్రహ్మపురాణమునందు శ్రీ బ్రహ్మ కృత శ్రీ సూర్య స్తోత్రం -  ముప్పది మూడవ అధ్యాయము.



అదిదేవోసి దేవానా మైశ్వర్యాచ్చ త్వమీశ్వరః | ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకరః || 9
జీవనః సర్వభూతానాం దేవగంధర్వ రక్షసామ్‌ | మునికిన్నర సిద్ధానాం తథై వోరగపక్షిణామ్‌ || 10
త్వం బ్రహ్మ త్వం మహాదేవ స్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః|వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్‌ వరుణకస్తథా|| 11
త్వం కాలః సృష్టికర్తా చ హర్తా భర్తా తథా ప్రభుః | సరితః సాగరాః శైలా విద్యుదింద్ర ధనూంషిచ || 12
ప్రళయః ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్తః సనాతనః | ఈశ్వరా త్పరతో విద్యావిద్యాయాః పరతః శివః || 13
శివాత్పరతరో దేవ స్త్వమేవ పరమేశ్వరః | సర్వతః పాణిపాదాంతః సర్వత్తోక్షి శిరోముఖః || 14
సహస్రాంశుః సహస్రాస్యః సహస్ర చరణక్షణః | భూతాది ర్భూర్భువః స్వశ్చ మహః సత్యం తపో జనః || 15
ప్రదీప్తం దీపనం దివ్యం సర్వలోకప్రకాశకమ్‌ | దుర్నిరీక్షం సురేంద్రాణాం యద్రూపం తస్య తే నమః || 16
సురసిద్ధగణౖర్జుష్టం భృగ్వత్రిపులహాదిభిః | స్తుతం వరమ మవ్యక్తం యద్రూపం తస్య తే నమః || 17
వేద్యం వేదవిదం నిత్యం సర్వజ్ఞాన సమన్వితమ్‌ | సర్వదేవాదిదేవస్య యద్రూపం తస్య తే నమః || 18
విశ్వకృ ద్విశ్వభూతం చ వైశ్వానరసురార్చితమ్‌ | విశ్వస్థిత మచింత్యం చ యద్రూపం తస్య తే నమః || 19
పరం యజ్ఞాత్‌ పరం వేదాత్‌ పరం లోకాత్‌ పరం దివః | పరమాత్మే త్యభిఖ్యాతం యద్రూపం తస్య తే నమః|| 20
అవిజ్ఞేయ మనాలక్ష్య మధ్యానగత మవ్యయమ్‌ | అనాదినిధనం చైవ యద్రూపం తస్య తే నమః || 21
నమోనమః కారణకారణాయ నమోనమః పాపవిమోచనాయ | నమో నమస్తే దితిజార్దనాయ, నమోనయో రోగ విమోచనాయ|| 22
నమోనమః సర్వవరప్రదాయ, నమోనమః సర్వసుఖ ప్రదాయ| నమోనమః సర్వధనప్రదాయ, నమోనమః సర్వ మతిప్రదాయ || 23
స్తుతః సభగవానేవం తైజసం రూపమాస్థితః | ఉవాచ వాచా కల్యాణ్యా కో వరో వః ప్రదీయతాం 24
బ్రహ్మయిట్లనియె! లోకములు తమఃప్రాయములు కాగా చరాచరసృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతియొక్క గుణవికారమునకు గారణమై బుద్ధి జనించెను. అందుండి యహంకారము, దాన మహాభూతములు నవ్వల నొకయండము జనించెను. ఈ లోకములెల్ల దానియందున్నవి. అందు నేను, విష్ణువు, శివుడునుండి తామస వృత్తులమై యీశ్వరునిధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యానయోగమందు మాకు సూర్యరూపుడై గోచరించెను. విశ్వరూపునిగ మే మాయనను స్తుతించితిమి.


------------------

------------------

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం